నగరిలో అభివృద్ధి పనుల జోరు: ఇందిరమ్మ లేఅవుట్లో తారు రోడ్డు ప్రారంభం

రిపోర్టర్: Alfa News Desk స్థలం: నగరి

చిత్తూరు జిల్లా నగరి మున్సిపాలిటీ పరిధిలోని ఇందిరమ్మ లేఅవుట్లో నూతనంగా నిర్మించిన తారు రోడ్డును స్థానిక ఎమ్మెల్యే భాను ప్రకాష్ ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, స్థానిక ప్రజలు హాజరై తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. గతంలో ఇబ్బందులు పడ్డామని, ఇప్పుడు రవాణా సౌకర్యం మెరుగుపడిందని స్థానికులు తెలిపారు. ఈ అభివృద్ధి పనులతో తమ ప్రాంతం మరింత ముందుకు వెళ్తుందని ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.