'వర్షాలు, పిడుగుల పట్ల అప్రమత్తంగా ఉండాలి': ఏపీలో భారీ వర్ష సూచన

రిపోర్టర్: సురేష్ స్థలం: ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు, పిడుగులు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు. గుంటూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు.