జలంధర్‌లో అపహరణకు గురైన నాలుగు సంవత్సరాల బాలుడు సురక్షితంగా రెస్క్యూ

రిపోర్టర్: సునీల్ స్థలం: జలంధర్

పంజాబ్ రాష్ట్రం జలంధర్‌లోని పన్ను విహార్‌లో ఆడుకుంటున్న నలుగురు సంవత్సరాల బాలుడు కేశవ్‌ను ఇద్దరు దుండగులు స్కూటర్‌పై అపహరించుకెళ్లారు. బస్తీ బావా ఖేల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనపై వెంటనే స్పందించిన పోలీసులు, సీసీటీవీ పుటేజీల ఆధారంగా గాలింపు చర్యలు చేపట్టారు. సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరగడంతో భయపడిన నిందితులు, పది గంటల వ్యవధిలోనే బస్సు స్టాండ్ సమీపంలో బాలుడిని వదిలిపెట్టి పారిపోయారు. పోలీసులు బాలుడిని సురక్షితంగా రక్షించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.