యూరప్ లో నిరసనల హోరు: జర్మనీ, ఫ్రాన్స్ దేశాలలో భగ్గుమన్న ప్రజా ఆగ్రహం

రిపోర్టర్: సునీల్ స్థలం: జర్మనీ

జీవన వ్యయం పెరుగుదల మరియు ప్రజా సమస్యలపై జర్మనీ, ఫ్రాన్స్ దేశాలలో వేలాది మంది ప్రజలు భారీ నిరసనలకు దిగినట్లు అంతర్జాతీయ మీడియా అధికారులు వెల్లడించారు. జర్మనీలో యువత జెన్ జెడ్ పేరుతో ప్రత్యేక ఉద్యమం ప్రారంభించగా, ఫ్రాన్స్ లో ఎల్ లో వెస్ట్ ఆందోళనలు ఉద్ధృతమయ్యాయి. ఈ పరిణామాల నేపథ్యంలో రెండు దేశాలలోనూ భద్రతా బలగాలను భారీగా మోహరించి, బహిరంగ ప్రదేశాలలో ఆంక్షలు విధించినట్లు అధికారులు స్పష్టం చేశారు.