సంక్రాంతి బరిలో నిలవనున్న చిరంజీవి కాకా చిత్ర డబ్బింగ్ షురూ

రిపోర్టర్: కృష్ణ స్థలం: హైదరాబాద్

అగ్ర నటుడు చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న కాకా చిత్రానికి సంబంధించిన డబ్బింగ్ కార్యక్రమాలు ప్రారంభమైనట్లు చిత్ర బృందం వెల్లడించింది. దర్శకుడు బాబీ కొల్లి తెరకెక్కిస్తున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. షూటింగ్తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులను సమాంతరంగా నిర్వహిస్తున్నామని, త్వరలోనే అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని వారు స్పష్టం చేశారు.