నార్సింగిలో మాస్టర్ప్లాన్ రోడ్డు మార్పు కలకలం: ఇండ్ల కూల్చివేతలపై బాధితుల ఆగ్రహం

రిపోర్టర్: విజయ్ స్థలం: రంగారెడ్డి

నార్సింగిలో మాస్టర్ ప్లాన్ రోడ్డు అలైన్మెంట్ మార్పు తీవ్ర కలకలం రేపుతోందని, రియల్టర్ల ప్రయోజనాల కోసం హెచ్ఎండీఏ అధికారులు సామాన్యుల ఇండ్లను టార్గెట్ చేసి రెడ్మార్క్ వేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా నార్సింగి మణికొండ ప్రాంతంలో వంద ఫీట్ల రహదారి మార్పుతో వేలాది కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందని, సర్కార్ పెద్దల రియల్ వ్యాపారం కోసం తమ బతుకులను బలి చేస్తున్నారంటూ స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.