స్పీకర్పై అనుచిత వ్యాఖ్యలు.. తాతా మధు దిష్టిబొమ్మ దహనం

రిపోర్టర్: Radha. A స్థలం: కడెం

కడెం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ, కాంగ్రెస్ నాయకులు ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు.

రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న స్పీకర్ను అవమానించడం ప్రజాస్వామ్యాన్ని కించపరచడమేనని కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి బర్తరఫ్ చేయాలని, కేసీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు.