తీవ్ర వాతావరణ హెచ్చరిక: ఎల్నినో ప్రభావంతో రానున్న కాలంలో భారీ ఎండలు
రిపోర్టర్: నరేష్
స్థలం: Andhra Pradesh / Telangana
రానున్న అక్టోబర్, నవంబర్, డిసెంబర్ త్రైమాసికంలో అత్యంత వేడి వాతావరణం ఉంటుందని, కానోనికల్ ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉండనుందని స్కైమెట్ వెదర్ (Skymet Weather - వ్యవసాయ వాతావరణ అంచనాలు & వర్షపాతం) వెల్లడించింది. ఈ కాలంలో ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరుగుతాయని, వ్యవసాయ రంగానికి వాతావరణ సవాళ్లు ఎదురుకావచ్చని స్పష్టం చేసింది. అన్నదాతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, వాతావరణ మార్పులను ఎప్పటికప్పుడు గమనించాలని సూచించింది.