సీతారామపురం మండల నూతన ప్రజాప్రతినిధులకు పోకలవారిపల్లిలో ఘనంగా జరిగిన సన్మానం
రిపోర్టర్: Durgam Syam
స్థలం: సీతారామపురం
సీతారామపురం మండల నూతన ఎంపీపీ చింతల కళావతి మరియు జడ్పీటీసీ కుర్రా వెంకటలక్ష్మిలను పోకలవారిపల్లిలో సొసైటీ డైరెక్టర్ పెనుబడి రఘురాములు ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. మండల అభివృద్ధికి అంకితభావంతో కృషి చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొని నూతన ప్రతినిధులకు ఘనమైన స్వాగతం పలికారు.