అసెంబ్లీకి వెళ్తున్న ఎమ్మెల్యేలను అడ్డుకోవడంపై హైకోర్టు ఆగ్రహం

రిపోర్టర్: విజయ్ స్థలం: హైదరాబాద్

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకోవడంపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. అసెంబ్లీ స్పీకర్ పరిధిలో పోలీసులకు ఏం పని అని సూటిగా ప్రశ్నించింది. మహిళా ఎమ్మెల్యేల పట్ల వ్యవహరించిన తీరుపై సీరియస్ అయ్యింది. ఈ ఘటనపై సమగ్ర నివేదికను రెండు వారాల్లో సమర్పించాలని రాష్ట్ర డీజీపీని హైకోర్టు ఆదేశించింది.