స్థానిక ఎన్నికల పోలింగ్: కూటమి శ్రేణులకు ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: అమరావతి
స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ సరళిపై కూటమి పార్టీల ముఖ్యనేతలు, కేడర్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. పోలింగ్ శాతం పెంచడమే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో శ్రేణులు మరింత చురుగ్గా పని చేయాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతున్నాయని, ఓటర్లందరూ తమ ఓటు హక్ కు వినియోగించుకునేలా నాయకులు సమన్వయం చేసుకోవాలని ఆయన సూచించారు. అవాంఛనీయ ఘటనలు జరిగితే వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని ఆదేశించారు.