గోవా వేదికగా ఐపీఎల్ వేలం నిర్వహించనున్నట్లు బీసీసీఐ ప్రకటన
రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్
స్థలం: గోవా
ఐపీఎల్ 2027 సీజన్ ఆటగాళ్ల వేలాన్ని ఈసారి స్వదేశంలోనే నిర్వహించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ నిర్ణయించింది. ఈ ఏడాది డిసెంబర్ నెలలో గోవా వేదికగా ఐపీఎల్ వేలం జరగనుందని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా బుధవారం అధికారికంగా వెల్లడించారు. గత మూడు సీజన్లలో విదేశీ నగరాల్లో వేలం నిర్వహించిన తర్వాత, బోర్డు మళ్లీ స్వదేశీ గడ్డపైకి వేలం ప్రక్రియను తీసుకువస్తోంది.