కొండా సురేఖతో కాంగ్రెస్ ఇన్‌చార్జ్ మీనాక్షీ నతరాజన్ ఫోన్ సంభాషణ

రిపోర్టర్: అశోక్ స్థలం: హైదరాబాద్

మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన కొండా సురేఖకు కాంగ్రెస్ రాష్ట్ర ఇన్‌చార్జ్ మీనాక్షీ నటరాజన్ ఫోన్ చేసి మాట్లాడారు. అంతర్గత విభేదాలు పక్కనపెట్టి పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా మారాలని సూచించారు. బర్తరఫ్ తర్వాత సురేఖ అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉంటున్న నేపథ్యంలో, ఆమె ఇకనైనా సమావేశాలకు హాజరవుతారా లేదా అనే అంశంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొన్నది.