రింతాడలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక
రిపోర్టర్: MADHIRI CHANTIBABU
స్థలం: జి.కె.వీధి
రింతాడ గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్) కార్యక్రమం నిర్వహించనున్నట్లు పంచాయతీ కార్యదర్శి అరుణ్ కుమార్ తెలిపారు.
ఈ కార్యక్రమానికి రెవెన్యూ, హౌసింగ్, ఉపాధి హామీ, ఆరోగ్యం, విద్యుత్ తదితర శాఖల మండల స్థాయి అధికారులు హాజరుకానున్నారు. గ్రామస్తులు తమ సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కారం పొందాలని ఆయన కోరారు.