పుంగనూరు హింసలో సంచలన నిజాలు: ఎంపీ కాన్వాయ్లో రౌడీషీటర్లని స్పష్టం చేసిన డీఐజీ

రిపోర్టర్: సతీష్ స్థలం: పుంగనూరు

పుంగనూరులో చెలరేగిన హింసపై కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ విలేకరుల సమావేశంలో సంచలన విషయాలు వెల్లడించారు. రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి కాన్వాయ్ వాహనాల్లో పలువురు రౌడీషీటర్లు ప్రయాణించారని ఆయన స్పష్టం చేశారు. పోలీసు హెచ్చరికలను లెక్కచేయకుండా నామినేషన్ కేంద్రం గేట్లను ఢీకొట్టి దాడులకు తెగబడ్డారని డీఐజీ తెలిపారు. ఈ ఘర్షణల్లో మొత్తం పదమూడు మంది కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారని, సీసీటీవీ టేజ్ ఆధారంగా నిందితులను గుర్తిస్తున్నామని అధికారులు పేర్కొన్నారు.