యూకే జీరో సెవెన్ రైడర్ అనురాగ్ డోభాల్ అరెస్ట్: కిడ్నాప్ కేసులో సంచలనం
రిపోర్టర్: రాజేష్
స్థలం: Dehradun
ప్రముఖ మోటో వ్లాగర్, బిగ్బాస్ ఫేమ్ అనురాగ్ డోభాల్ను డెహ్రాడూన్ పోలీసులు అరెస్ట్ చేశారు. కుటుంబ వివాదం నేపథ్యంలో రాజ్ సింగ్ చౌహాన్ను కిడ్నాప్ చేసి దాడి చేశారనే ఆరోపణలతో అనురాగ్ డోభాల్తో పాటు మరో ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. హరిద్వార్ బైపాస్ రోడ్డులో జరిగిన ఈ దాడి ఘటన తీవ్ర కలకలం రేపింది. నిందితుల బెయిల్ పిటిషన్ను న్యాయస్థానం తిరస్కరించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.