నయా నిజాంల లాగా రేవంత్ రెడ్డి పాలన అంటూ బండి సంజయ్ ఫైర్

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: తెలంగాణ

తెలంగాణలో కుర్చీలు, జెండాలు మారినా పాలకుల తీరు మాత్రం మారలేదని కేంద్రమంత్రి బండి సంజయ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గతంలో కేసీఆర్, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇద్దరూ ఎంఐఎంతో అంటకాగుతూ నిజాం నవాబును గొప్ప రాజుగా కీర్తిస్తున్నారని మండిపడ్డారు. నిజాం రాజు తరతరాల బూజు అంటూ దాశరథి చెప్పిన మాటలను గుర్తుచేస్తూ, ఆ బూజును దులుపుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నయా నిజాంల లాగా వ్యవహరిస్తోందని ఘాటుగా విమర్శించారు.