డెస్టినీ ఫస్ట్ లుక్ విడుదల: ఇమ్మాన్యుయేల్ చేతికి సంకెళ్లతో పోస్టర్ వైరల్

రిపోర్టర్: శివ స్థలం: హైదరాబాద్

ప్రముఖ హాస్య నటుడు ఇమ్మాన్యుయేల్ లీడ్ రోల్లో నటిస్తున్న తాజా చిత్రం డెస్టినీ ఫస్ట్ లుక్ పోస్టర్ను ప్రముఖ దర్శకురాలు నందినీ రెడ్డి విడుదల చేసినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. కుర్ర ప్రొడక్షన్స్ బ్యానర్పై దినేష్ కుర్ర నిర్మిస్తున్న ఈ చిత్రానికి చెందు ముద్దు దర్శకత్వం వహిస్తున్నారు. పోస్టర్లో ఇమ్మాన్యుయేల్ చేతికి సంకెళ్లు వేసి ఉండటం సినిమాపై అంచనాలను పెంచేసిందని, త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన మరిన్ని వివరాలు ప్రకటిస్తామని మేకర్స్ స్పష్టం చేశారు.