సియాంగ్ ప్రాజెక్ట్ వ్యతిరేక ఆందోళనలపై అరుణాచల్ సీఎం పెమా ఖండు స్పష్టత

రిపోర్టర్: విజయ్ స్థలం: Arunachal Pradesh

అరుణాచల్ ప్రదేశ్ లో సియాంగ్ అప్పర్ జలవిద్యుత్ ప్రాజెక్ట్ పై జరుగుతున్న ఆందోళనలను పరిష్కరిస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పెమా ఖండు స్పష్టం చేశారు. స్థానిక ప్రజలతో బహిరంగ చర్చలు, పారదర్శకత ద్వారానే సమస్యను పరిష్కరిస్తామని ఆయన తెలిపారు. ప్రాజెక్ట్ నిర్మాణంపై ప్రజల్ లో నెలకొన్న అపోహలను తొలగిస్తామని, ఎలాంటి నిర్ణయమైనా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే తీసుకుంటామని ముఖ్యమంత్రి వివరించారు. చైనా నిర్మిస్తున్న హైడ్రో ప్రాజెక్ట్ కారణంగా తలెత్తే నీటి ముప్పును ఎదుర్కొనేందుకే ప్రాథమిక నివేదిక సిద్ధం చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.