ప్రధాని మోడీ జన్మదిన వేడుకల్లో ఆశీర్వాద దీపం వెలిగిద్దాం
రిపోర్టర్: Abdul Azeem
స్థలం: ఆమనగల్లు
గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా సెప్టెంబర్ 17న సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్య ప్రతి ఇంట్లో ఆశీర్వాద దీపం వెలిగిద్దామని బీజేపీ నేత, జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి పిలుపునిచ్చారు. 25 ఏళ్లుగా దేశసేవకు అంకితమై పేదల జీవితాల్లో మార్పు తెచ్చిన నరేంద్రుడికి మన మద్దతు తెలపాలని ఆమనగల్లు మండల ప్రజలను ఆయన కోరారు.