పా రంజిత్ దర్శకత్వంలో భారీ యాక్షన్ సినిమాగా వేట్టువం

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: భారతదేశం

దర్శకుడు పా రంజిత్ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా యాక్షన్ చిత్రం వేట్టువం ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు వరల్డ్ ఆఫ్ వేట్టువం వీడియో విడుదలైంది. ఈ సినిమాలో ఆర్య, శోభిత ధూళిపాళ్ల, కలైయరాసన్, మైమ్ గోపి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. లెర్న్ అండ్ టీచ్ ప్రొడక్షన్, నీలమ్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై తెరకెక్కుతున్న ఈ సినిమా మూడు కాలాల నేపథ్యంతో తెగల మధ్య జరిగే పోరాటంగా డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.