ఆరోగ్యమే మహాభాగ్యం: గుండెపోటు ఘటనపై ఆసిఫ్ ఖాన్ కీలక వ్యాఖ్యలు
రిపోర్టర్: అశోక్
స్థలం: Hyderabad
ఆరోగ్యమే ప్రథమ ప్రాధాన్యతగా భావించాలని, ఎట్టిపరిస్థితుల్లోనూ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దని బిగ్ బాస్ ఫేమ్ నటుడు ఆసిఫ్ ఖాన్ తెలిపారు. తన జీవితంలో ఎదురైన గుండెపోటు అనుభవంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. మంచి జీవనశైలిని అలవర్చుకోవాలని, నిద్ర వేళలు మరియు ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆసిఫ్ సూచించారు. చిన్న పొరపాట్లే పెద్ద అనారోగ్య సమస్యలకు దారితీస్తాయని ఆయన హెచ్చరించారు.