అమెరికా ఎన్నికల్ లో ఎలాన్ మస్క్ రికార్డు విరాళాలు: రిపబ్లికన్ల కోసం నాలుగు వేల కోట్లు

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: అమెరికా

అమెరికా మధ్యంతర ఎన్నికల ప్రచారంలో భాగంగా టెస్లా అధినేత ఎలాన్ మస్క్ రాజకీయ విరాళాల రూపంలో భారీ మొత్తాన్ని ఖర్చు చేస్తున్నట్లు ఫెడరల్ ఎలక్షన్ కమిషన్ రికార్డులు వెల్లడించాయి. గత ఏడాది కాలంగా రిపబ్లికన్ పార్టీకి అనుకూలంగా పనిచేసే సంస్థలకు ఆయన సుమారు నాలుగు వేల రెండు వందల కోట్ల రూపాయలు అందించినట్లు గార్డియన్ కథనం పేర్కొంది. అమెరికా ఆధునిక రాజకీయ చరిత్రలో ఒకే ఎన్నికల చక్రంలో వ్యక్తిగతంగా ఇచ్చిన అత్యధిక విరాళం ఇదేనని సమాచారం.