ఇంద్రకీలాద్రిపై మూలా నక్షత్ర దర్శనాలు: భక్తులతో కిటకిటలాడుతున్న దుర్గమ్మ ఆలయం

రిపోర్టర్: రమేష్ స్థలం: విజయవాడ

విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల్లో భాగంగా మూలా నక్షత్ర దర్శనాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. సరస్వతీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్న అమ్మవారిని చూసేందుకు భారీగా జనం తరలివస్తున్నారని అధికారులు తెలిపారు. సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని క్యూలైన్లలో ఉచిత దర్శనాలు కల్పిస్తున్నామని, రద్దీ నేపథ్యంలో వీవీఐపీ దర్శనాలు పూర్తిగా రద్దు చేశామని కలెక్టర్ లక్ష్మీశ స్పష్టం చేశారు.