రష్యా పార్లమెంటు ఎన్నికల్లో పుతిన్ పార్టీ ఘన విజయం
రిపోర్టర్: సురేష్
స్థలం: రష్యా
రష్యాలో ఇటీవల జరిగిన పార్లమెంటరీ ఎన్నికల్లో అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు చెందిన యునైటెడ్ రష్యా పార్టీ అఖండ విజయాన్ని సాధించింది. కేంద్ర ఎన్నికల కమిషన్ వెల్లడించిన గణాంకాల ప్రకారం 95 శాతానికి పైగా ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి ఈ పార్టీ 57.83 శాతం ఓట్లను కైవసం చేసుకుంది. మొత్తం 450 స్థానాలు కలిగిన స్టేట్ డుమాలో ఈ పార్టీ ఏకంగా 355 సీట్లను దక్కించుకోనున్నట్లు స్పష్టమవుతోంది.