పన్నెండేళ్లు కష్టపడితే ఒరాకిల్ ఇచ్చిన బహుమానం అదేనా!
రిపోర్టర్: కృష్ణ
స్థలం: USA
ప్రముఖ టెక్ దిగ్గజం ఒరాకిల్ సంస్థలో భారీగా లేఆఫ్స్ కొనసాగుతున్నాయి. పన్నెండేళ్లుగా సంస్థ కోసం అంకితభావంతో పనిచేసిన సౌరభ్ అనే ఉద్యోగికి ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే తొలగించారు. భార్యకు ఆసుపత్రిలో సర్జరీ జరుగుతున్న సమయంలోనూ విధుల్లో ఉన్న అతడి సిస్టమ్ లాగిన్‌ను నిలిపివేశారు. ఈ ఘోర పరిణామంపై అతని భార్య పూజా సాహు లింక్డ్ఇన్లో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ భావోద్వేగ పోస్ట్ పెట్టారు.