ఆప్ జాతీయ కన్వీనర్‌గా మరోసారి అరవింద్ కేజ్రీవాల్ ఎన్నిక
రిపోర్టర్: గోపి
స్థలం: న్యూఢిల్లీ
ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌గా అరవింద్ కేజ్రీవాల్ మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఢిల్లీలో జరిగిన జాతీయ మండలి వర్చువల్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ సంస్థను బలోపేతం చేసే దిశగా 23 మందితో కూడిన నూతన జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించారు. పంకజ్ గుప్తా జాతీయ కార్యదర్శిగా, ఎన్.డి. గుప్తా కోశాధికారిగా నియమితులయ్యారు. కేజ్రీవాల్ నాయకత్వంలో పార్టీ ఏ సవాలునైనా ఎదుర్కొంటుందని ఆప్ నేతలు స్పష్టం చేశారు.