నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ వ్యవస్థాపకుడు అల్లూరి వెంకట సత్యనారాయణరాజు కన్నుమూత

రిపోర్టర్: గోపి స్థలం: హైదరాబాద్

దేశ ప్రముఖ నిర్మాణ రంగ సంస్థ నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ వ్యవస్థాపక ఛైర్మన్, పద్మశ్రీ అవార్డు గ్రహీత అల్లూరి వెంకట సత్యనారాయణరాజు కన్నుమూశారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన వయసు 89 సంవత్సరాలు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జన్మించిన ఆయన, 1990లో ఎన్సీసీని స్థాపించి దేశంలోనే అగ్రగామి సంస్థగా తీర్చిదిద్దారు. దేశ మౌలిక రంగానికి ఆయన అందించిన విశేష సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం 2010లో ఆయనను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.