తిరుమలలో ఘనంగా నవరాత్రి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేసిన టీటీడీ
రిపోర్టర్: సతీష్
స్థలం: తిరుమల
తిరుమల క్షేత్రంలో అక్టోబర్ పన్నెండు నుంచి ఇరవై వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. ఈ వేడుకలకు సర్వం సిద్ధం చేశామని తెలిపారు. ఈ ఉత్సవాల్లో అక్టోబర్ పదహారున అత్యంత ప్రాముఖ్యమైన గరుడ వాహన సేవ అలాగే ఇరవైవ తేదీన చక్రస్నానంతో ఉత్సవాలు పరిసమాప్తం కానున్నాయని పేర్కొన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అన్ని పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేశారని వెల్లడించారు.