సాహస యాత్ర పూర్తి: ఇరవై ఎనిమిదేళ్ల తర్వాత స్వగ్రామానికి చేరిన కార్ల్

రిపోర్టర్: గోపి స్థలం: హల్

ఇరవై ఎనిమిదేళ్ల పాటు ప్రపంచమంతా నడక ద్వారా చుట్టివచ్చిన బ్రిటన్ సాహసికుడు కార్ల్ బుష్బీ ఎట్టకేలకు తన సొంతూరికి చేరుకున్నారు. ఎలాంటి వాహనాలను ఉపయోగించకుండా సుమారు ముప్ పై వేల మైళ్లకు పైగా సుదీర్ఘ ప్రయాణం చేసిన ఆయన ఇంగ్లాండ్ లోని హల్ నగరానికి తిరిగి వచ్చారు. ఈ అద్భుత సాహస యాత్రలో తనకు అడుగడుగునా సహకరించిన ప్రపంచ మానవతావాదులకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఈ సందర్భంగా కార్ల్ బుష్బీ స్పష్టం చేశారు.