ధరణితో రైతులు తీవ్రంగా నష్టపోయారు: మంత్రి పొంగులేటి
రిపోర్టర్: కిరణ్
స్థలం: తెలంగాణ
ధరణి పోర్టల్ వల్ల తెలంగాణలో లక్షలాది మంది రైతులు తీవ్రంగా నష్టపోయారని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శాసనసభలో ఆరోపించారు. భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం తీసుకొచ్చిన 'భూభారతి చట్టం' రూపకల్పన వెనుక సుదీర్ఘ అధ్యయనం ఉందని స్పష్టం చేశారు. 18 రాష్ట్రాల్లో పర్యటించి, ప్రతిపక్షాల సూచనలను కూడా పరిగణనలోకి తీసుకుని అత్యంత పారదర్శకంగా ఈ చట్టాన్ని రూపొందించామని ఆయన తెలిపారు.