రెండు దశాబ్దాల తర్వాత ఒక్కటైన ఖమ్మం శ్రీవిద్య కాలేజీ పూర్వ విద్యార్థులు

రిపోర్టర్: ఆముదాల వెంకన్న స్థలం: ఖమ్మం అర్బన్

ఖమ్మం శ్రీ విద్య ఇంటర్ కాలేజీలో రెండు దశాబ్దాలకు పైగా సుదీర్ఘ విరామం అనంతరం 2002–2004 బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించుకున్నారు. ఇరవై రెండు సంవత్సరాల తర్వాత ఒకేచోట కలుసుకున్న మిత్రులు తమ కళాశాల రోజుల మధుర జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఉత్సాహంగా సాగిన ఈ వేడుకలో నాటి స్నేహాలు, మరువలేని సంఘటనలు, సాంస్కృతిక కార్యక్రమాలను గుర్తుచేసుకుంటూ ఆనందంలో మునిగిపోయారు.