ఎల్నినో ప్రభావం: యాసంగిలో వరి సాగు చేయొద్దని రైతులకు సీఎం రేవంత్ విజ్ఞప్తి
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: హైదరాబాద్
రాష్ట్రంలో ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉందని, నీటి కొరత మునుపెన్నడూ లేనివిధంగా ఎదురుకానుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన మీడియాతో మాట్లాడారు. రైతులు పెద్ద మనసుతో ఆలోచించి యాసంగిలో వరి పంటకు బదులుగా ఆరుతడి పంటలను మాత్రమే సాగు చేయాలని విజ్ఞప్తి చేశారు. రిజర్వాయర్లలో నీటి మట్టాలు భారీగా తగ్గిపోయాయని, ప్రజలందరూ ప్రభుత్వానికి సహకరించాలని ముఖ్యమంత్రి కోరారు.