బీసీ హాస్టల్ విద్యార్థుల దాహం తీర్చేలా పూర్వ విద్యార్థుల ముందడుగు

రిపోర్టర్: UserK BALAYESU స్థలం: సీతారామపురం

సీతారామపురం మండల పరిధిలోని అయ్యవారిపల్లి గ్రామంలోని బీసీ హాస్టల్ కు పూర్వ విద్యార్థులు నాలి రత్తయ్య, పామూరు రవి సహకారంతో శుక్రవారం విద్యార్థుల కొరకు ఫ్రిజ్ ను వార్డెన్ షకీల్ కు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాటి జ్ఞాపకాలను నెరువేర్చుకుంటూ విద్యార్థుల కొరకు తమ వంతు సహకారం అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తోట సురేష్, దియల శ్రీనివాసులు, గోలపల్లి జక్కరయ్య, రాజు తదితరులు పాల్గొన్నారు.