అఫిడవిట్లలో తప్పుడు సమాచారం: ప్రజాప్రతినిధులపై పౌరులు నేరుగా ఫిర్యాదు చేయవచ్చని సుప్రీంకోర్టు స్పష్టీకరణ

రిపోర్టర్: భాస్కర్ స్థలం: New Delhi

ఎన్నికల అఫిడవిట్లలో తప్పుడు సమాచారం ఇచ్చే ప్రజాప్రతినిధులు మరియు అభ్యర్థులపై సాధారణ పౌరులు నేరుగా క్రిమినల్ ఫిర్యాదులు చేయవచ్చని సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. దీని కోసం ఎన్నికల సంఘం లేదా ప్రభుత్వ అధికారిక ముందస్తు అనుమతి అవసరం లేదని జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ శీల్ నాగులతో కూడిన ధర్మాసనం సోమవారం స్పష్టం చేసినట్లు సుప్రీంకోర్టు వర్గాలు వెల్లడించాయి.