ఫాంహౌస్‌ల వివాదంతో ఆత్మరక్షణలో పడిన బీఆర్ఎస్ నేతలు

రిపోర్టర్: సతీష్ స్థలం: Hyderabad

తెలంగాణలో బీఆర్ఎస్ నేతల ఫాంహౌస్‌ల ఆస్తులు, భూ లావాదేవీల అంశం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. గత పదేళ్ల పాలనలో నిబంధనలకు విరుద్ధంగా భూములు ఆక్రమించారంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా విమర్శలు గుప్పించడంతో పాటు క్షేత్రస్థాయి విజిట్లతో దూకుడు పెంచింది. అయితే కాంగ్రెస్ సంధిస్తున్న సూటి ప్రశ్నలకు, అఫిడవిట్లలోని తేడాలపై స్పష్టమైన ఆధారాలతో కౌంటర్ ఇవ్వలేక బీఆర్ఎస్ నాయకులు తీవ్ర రక్షణ ధోరణిలో పడ్డారనే విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి.