ఈపీఎఫ్వోకు 74 ఏళ్లు: సామాజిక భద్రతలో కీలక మైలురాయిని దాటిన వైనం

రిపోర్టర్: శివ స్థలం: Andhra Pradesh / Telangana

సామాజిక భద్రతను కల్పిస్తూ దేశంలోని కార్మికులు, ఉద్యోగుల సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తున్న ఈపీఎఫ్వో సంస్థ సేవలు 74 సంవత్సరాలు పూర్తి చేసుకున్నట్లు Ministry of Labour & Employment, GoI వెల్లడించింది. భవిష్య నిధి పొదుపుతో ప్రారంభమై నేడు పౌరుల ప్రతి అవసరానికి అండగా నిలుస్తోందని పేర్కొంది. కార్మికుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఈ సంస్థ కీలక పాత్ర పోషిస్తోందని, జీవితంలోని ప్రతి దశలోనూ అర్థిక భరోసాను అందిస్తూ ప్రజల కలలను సాకారం చేస్తోందని కేంద్ర మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.