రాహుల్ గాంధీ సైనికుడిగా చేసిన పోరాటానికి దక్కిన గుర్తింపు అంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్య
రిపోర్టర్: రాజేష్
స్థలం: Hyderabad
తెలంగాణ కాంగ్రెస్ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను పంచుకుంది. ఆర్యదాన్ ముహమ్మద్ అవార్డును అందుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ అరుదైన గౌరవం తన ఒక్కడికే చెందదని, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సైనికుడిగా తాను చేసిన సుదీర్ఘ పోరాటానికి దక్కిన గొప్ప గుర్తింపు అని ఆయన పేర్కొన్నారు. ప్రజల పక్షాన నిలిచి చేస్తున్న పోరాటమే తనకు ఈ సముచిత గౌరవాన్ని తెచ్చిపెట్టిందని, భవిష్యత్తులోనూ ప్రజా సంక్షేమం కోసం మరింత అంకితభావంతో మునుముందుకు సాగుతానని ఆయన స్పష్టం చేశారు.