మేనకోడలి వివాహ వేడుకలో జగన్కు ప్రాణహాని: షర్మిల కుటుంబసభ్యుల సంచలన ఆరోపణలు

రిపోర్టర్: రాము స్థలం: Hyderabad

ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన చెల్లెలు వైఎస్ షర్మిల కుమార్తె అంజిలి రెడ్డి వివాహం సందర్భంగా తనకు ప్రాణహాని ఉందంటూ రాసిన లేఖపై ఆమె కుటుంబ సభ్యులు మరియు సన్నిహితులు తీవ్రస్థాయిలో స్పందించారు. వైఎస్ కుటుంబంలో జరిగిన అనేక వివాహాలను ఉదహరిస్తూ, నాటి పరిస్థితులతో పోలిస్తే నేడు జగన్ చేస్తున్న హడావుడి కేవలం డ్రామాలేనని వారు ఆరోపించారు. పెళ్లికి రాకపోవడానికి ఇలాంటి కుట్రపూరిత డ్రామాలు కట్టిపెట్టి, ఇష్టమైతే వివాహానికి హాజరుకావాలని వారు హితవు పలికారు.