మున్సిపల్ ఎన్నికల్ లో కూటమి హవా: క్లీన్ స్వీప్ చేసిన అభ్యర్థులు
రిపోర్టర్: అశోక్
స్థలం: అమరావతి
రాష్ట్రంలో జరుగుతున్న పట్టణ స్థానిక ఎన్నికల ఫలితాలలో కూటమి అభ్యర్థులు స్పష్టమైన విజయం సాధిస్తున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. మాచర్ల, కొవ్వూరు, మడకశిర మరియు పెనుకొండ పురపాలక సంఘాలలో కూటమి క్లీన్‌స్వీప్ సాధించిందని వెల్లడించారు. ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్సీపీ ఖాతా తెరవలేదని అధికారులు స్పష్టం చేశారు. పలు చోట్ల టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులు భారీ ఆధిక్యతతో విజయకేతనం ఎగురవేశారని ఎన్నికల సంఘం వర్గాలు పేర్కొన్నాయి.