ఎర్ర సముద్రంలో కలకలం: పద్నాలుగు మంది భారతీయులతో ఉన్న నౌకపై దాడి

రిపోర్టర్: శివ స్థలం: New Delhi

ఎర్ర సముద్రంలోని జుఖర్ ద్వీపం సమీపంలో పద్నాలుగు మంది భారతీయ నావికులతో ప్రయాణిస్తున్న నౌకను సౌదీ అరేబియా దళాలు లక్ష్యంగా చేసుకుని దాడి చేశాయని యెమెన్ హౌతీ సైనిక ప్రతినిధి యహ్యా సారీ వెల్లడించారు. ఈ ఘటనపై భారత రాయబార కార్యాలయం స్పందించి పూర్తి వివరాలను సేకరిస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుత ఘర్షణ వాతావరణం కారణంగా పూర్తి సమాచారం అందలేదని, బాధితుల రక్షణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.