ఇరాన్ విమానయాన రంగంపై అమెరికా తీవ్ర ఆంక్షలు
రిపోర్టర్: అశోక్
స్థలం: World
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఇరాన్‌ను ఆర్థికంగా దెబ్బతీసేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్ విమానయాన రంగంపై కొత్త ఆంక్షలు విధించింది. 36 సంస్థలు, పలు కమర్షియల్, ప్రైవేట్ ఎయిర్‌లైన్స్‌ను లక్ష్యంగా చేసుకుంది. ఆయుధాలు, అక్రమ సరుకుల రవాణాకు ఇరాన్ తన విమానయానాన్ని వాడుతోందని ఆరోపించింది. మరోవైపు, వెస్ట్ బ్యాంక్‌లోని ఇజ్రాయెల్ స్థావరాలపై బ్రిటన్ కూడా ఆంక్షలు విధించింది.