ఏ ముఖంతో గవర్నర్ను కలుస్తారంటూ జగన్ను నిలదీసిన సోమిరెడ్డి
రిపోర్టర్: Venkey ...Nlr
స్థలం: నెల్లూరు అర్బన్
శాప్ కార్యాలయం వద్ద ఉపాధ్యాయులపై దాడికి పాల్పడిన వైసీపీ నేతలు ఏ ముఖం పెట్టుకుని రేపు గవర్నర్ను కలుస్తారని సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, చేసిన పాపాలకు గవర్నర్ కాళ్లు పట్టుకుని వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ ఉద్యోగాల భర్తీని చూసి ఓర్వలేకనే ఆ పార్టీ నేతలు అరాచకాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.