శ్రేయస్ అయ్యర్ ఆటపై విమర్శలను కొట్టిపారేసిన మాజీ క్రికెటర్ అంబటి రాయుడు
రిపోర్టర్: కృష్ణ
స్థలం: Hyderabad
టీమిండియా బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఆటతీరుపై వస్తున్న విమర్శలను మాజీ క్రికెటర్ అంబటి రాయుడు తీవ్రంగా ఖండించారు. అతడు అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడని, ఎప్పుడు మైదానంలో దిగినా మ్యాచ్ విన్నర్ అని రాయుడు తెలిపారు. ప్రపంచంలోని అత్యుత్తమ బౌలర్లను ఎదుర్కొంటూ పూర్తి ఆధిపత్యం చెలాయిస్తాడని, అతడి స్ట్రైక్ రేట్ చూస్తేనే ఇది స్పష్టమవుతుందని అంబటి రాయుడు పేర్కొన్నారు.