అమెరికాలో విద్యార్థుల భాగస్వామ్యంతో నాట్స్ అడాప్ట్ ఎ పార్క్
రిపోర్టర్: కిరణ్
స్థలం: Dallas
అమెరికాలోని ఫ్రిస్కో నగరంలో విద్యార్థుల్లో సామాజిక బాధ్యత పెంపొందించేలా ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ఆధ్వర్యంలో అడాప్ట్ ఎ పార్క్ కార్యక్రమం నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. మొనార్క్ వ్యూ పార్క్ వేదికగా జరిగిన ఈ సేవా కార్యక్రమంలో ఇరవై మందికి పైగా చిన్నారులు ఉత్సాహంగా పాల్గొని పరిసరాలను శుభ్రపరిచారు. చిన్ననాటి నుంచే పర్యావరణ స్పృహ కల్పించేలా నాట్స్ చేపట్టిన ఈ వినూత్న ప్రయత్నం స్థానికుల నుంచి ఎంతో ప్రశంసలు అందుకున్నట్లు డల్లాస్ చాప్టర్ కోఆర్డినేటర్లు కిరణ్ నారె, పావని నున్న వెల్లడించారు.