ఐఓఏ అథ్లెట్స్ కమిషన్ అధ్యక్షురాలిగా పీవీ సింధు ఎన్నిక
రిపోర్టర్: వెంకట్
స్థలం: న్యూఢిల్లీ
భారతీయ ఒలింపిక్ సంఘం అథ్లెట్స్ కమిషన్ అధ్యక్షురాలిగా స్టార్ షట్లర్ పీవీ సింధు ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి అధికారికంగా వెల్లడించారు. ఉపాధ్యక్షుడిగా హాకీ ఆటగాడు హర్మన్‌ప్రీత్ సింగ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ఆయన తెలిపారు. ఈ కమిషన్ కు మీరాబాయి చాను, సాజన్ ప్రకాశ్ లు జనరల్ అసెంబ్లీ సభ్యులుగా ప్రాతినిధ్యం వహిస్తారని పేర్కొన్నారు. ఒక్కో పదవికి ఒక్క నామినేషన్ మాత్రమే దాఖలు కావడంతో ఎన్నికలు ఏకగ్రీవమైనట్లు స్పష్టం చేశారు.