పురుషోత్తపురంలో టిడిపి కార్యకర్తలపై వైసిపి వర్గీయుల దాడి
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: సరుబుజ్జిలి
శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం పురుషోత్తపురం గ్రామ పంచాయతీ పరిధిలోని ఫకీర్ సాహెబ్ పేట వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. 33వ పోలింగ్ కేంద్రం వద్ద ఓటింగ్ ప్రక్రియ జరుగుతుండగా టిడిపి కార్యకర్తలపై వైసిపి వర్గీయులు ఒక్కసారిగా దాడికి దిగారు. ఈ ఘటనతో పోలింగ్ కేంద్రం వద్ద తీవ్ర గందరగోళం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.