ఎన్టీఆర్ జిల్లావ్యాప్తంగా ఘనంగా స్వచ్ఛ ఆంధ్ర దినోత్సవం

రిపోర్టర్: గోపి స్థలం: NTR

స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర బాబు ఆదేశాల మేరకు ఎన్టీఆర్ జిల్లా పరిధిలోని పోలీస్ స్టేషన్లు, ఏసీపీ, డీసీపీ కార్యాలయాలు, ఎస్‌బీ, సీసీఆర్‌బీ కార్యాలయాల్లో విస్తృతంగా పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు, సిబ్బంది పరిసరాలను శుభ్రం చేసి మొక్కలు నాటారు.