ఢిల్లీలో మణిపూర్ గిటారిస్ట్ దారుణ హత్య, ఏడుగురు అరెస్ట్.

రిపోర్టర్: రాజేష్ స్థలం: ఢిల్లీ

ఢిల్లీలోని కిలోకారి గ్రామంలో అల్లరిని ప్రశ్నించిన మణిపూర్ సంగీత ఉపాధ్యాయుడు విక్రమ్ సింగ్ చోంగ్థమ్‌ను కొందరు వ్యక్తులు దారుణంగా కొట్టి చంపారు. చెత్త పారబోయడానికి కిందకు వెళ్లిన ఆయన వద్ద గొడవకు దిగి, మూడో అంతస్తు వరకు వెంబడించి మరీ దాడి చేశారు. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ మృతి చెందగా, పోలీసులు ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసి ఒక బాలుడిని అదుపులోకి తీసుకున్నారు.