మంచిర్యాల జిల్లా జన్నారంలో ఘనంగా జమ్మి పూజ
రిపోర్టర్: Gangadhar Reporter
స్థలం: జన్నారం
మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని వివిధ గ్రామాలలో జమ్మి కార్యక్రమం ఉత్సాహంగా జరుపుకున్నారు. శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మంగళవారం సాయంత్రం పట్టణ శివారులోని పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న జమ్మి చెట్టు వద్ద ప్రముఖులు ప్రజలు జమ్మి ఆకును ఇచ్చి పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు.